తిమ్మాజీపేట / వెల్దండ / అచ్చంపేట / అచ్చంపేట రూరల్/ జడ్చర్ల : బీఆర్ఎస్(BRS) సాధించిన ఉద్యమ ప్రస్థానాన్ని మననం చేసుకునే సందర్భంలో వరంగల్ ( Warangal) వేదికగా ఆదివారం జరగనున్న రజతోత్సవ జాతరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ శ్రేణులు దండుగా కదిలారు. ఊరు, వాడ ఏకమై అటు జెండా ( Flag ) పండుగను ఘనంగా నిర్వహించుకోగా ఇటు ఎల్కతుర్తికి పయనమయ్యారు.
తిమ్మాజీపేట మండలంలో బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. జెండాలు ఎగరవేసి మిఠాయిలు పంచిపెట్టారు. తెలంగాణను సాధించిన అనంతరం కేసీఆర్ ( KCR ) నాయకత్వంలో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని పార్టీ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ తదితరులు ఉన్నారు.
రాచూర్ గ్రామంలో ..
వెల్దండ మండల పరిధిలోని రాచూరు గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ జెండాను సింగల్ విండో డైరెక్టర్ షాంపూరి రాఘవేందర్ రెడ్డి ఆవిష్క రించారు. రాబోయే స్థానిక ఎన్నికలలో గ్రామంలో బీఆర్ ఎస్ జెండా ఎగరవేస్తామని అన్నారు.ఈ కార్య క్రమంలో మాజీ సర్పంచ్ జయమ్మ పర్వతాలు, మాజీ ఎంపీటీసీ గుత్తి వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ గుత్తి జంగయ్య, సీనియర్ నాయకులు రాధా కిషన్ గౌడ్, తాజుద్దీన్, గోకమల్ల రాజు, గుత్తి బాలకృష్ణ, హనుమంత రెడ్డి, రాములు, నరేష్, వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నూతన జోస్‌తో.. తరలిన అభిమానులు
అచ్చంపేట : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సాధించిన ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ చేసుకునే సందర్భంలో వరంగల్ వేదికగా ఆదివారం జరగనున్న రజతోత్సవ జాతరకు నల్లమల నడుం కట్టింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు( Guvvala Balaraju ) ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలి వెళ్లారు. గ్రామాలలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. 40 బస్సులు, క్రూజర్లు, జీపులు, సొంత వాహనాలలో దాదాపు ఐదువేల నుంచి 7వేల వరకు తరలి వెళ్ళినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలవకుండా ఘట్కేసర్ వద్ద మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.
రెపరెపలాడిన గులాబీ జెండా..
అచ్చంపేట రూరల్ : ఆదివారం గులాబీ జెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మండలంలోని 38 గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో రజతోత్సవ మహాసభకు పల్లె పల్లె నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.
దారులన్నీ వరంగల్ ఎల్కతుర్తి వైపే
జడ్చర్ల : బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ఆదివారం ఉదయం జడ్చర్లలో పార్టీ జెండాను ఆవిష్కరించి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు వరంగల్ సభకు తరలి వెళ్లారు.