హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నోటరీ ఆస్తు ల క్రయవిక్రమాలను క్రమబద్ధీకరించేందుకు జారీచేసిన జీవో 84కు వ్య తిరేకంగా హైకోర్టులో ప్రజాహిత వ్యా జ్యం దాఖలైంది. అక్రమ ఆస్తులను క్రమబద్ధీకరించడమంటే కష్టార్జితం లో భూమి కొనుకున్న వారికి తప్పు డు సంకేతాలు ఇవ్వడమే అవుతుందని, దీన్ని చట్ట వ్యతిరేకమైనదిగా ప్రకటించాలని భాగ్యనగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. 125 చదరపు గజాలు అంతకంటే తకువ విస్తీర్ణంలో నిర్మించిన ఆస్తులకు స్టాంప్ డ్యూటీ, పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే రాష్ట్ర ఖజానాకు తీ వ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జీవో 84ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేసిం ది. ఈ పిల్లో సీఎస్‌తోపాటు రెవె న్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ము న్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది.