హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో ఆరు ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాల భర్తీకి శుక్రవారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ ఆఫీసులో వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు.
అభ్యర్థులు అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలతో సకాలంలో హాజరుకావాలని సూచించారు. వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.