నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలు గా కొనసాగుతున్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును చంచల్‌గూడ జై లు అధికారులు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. మధ్యంతర బెయిల్‌పై ఉన్న మరో నిందితుడు భు జంగరావు గైర్హాజరు పిటిషన్‌ను ఆయన న్యాయవాది దాఖలు చేశా రు. పిటిషన్‌ను అంగీకరించిన కో ర్టు.. తదుపరి విచారణను ఈ నెల 2 4కు వాయిదా వేసింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై 27న సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి.
బార్ కౌన్సిల్ ఎన్నికలు ఎప్పుడు ; నిర్వహిస్తారో చెప్పండిహైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బార్ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని హైకోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోపాటు రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు స్పష్టం చేసింది. ప్రస్తుత బార్ కౌన్సిల్ పాలకవర్గం గడువు 6 నెలల క్రితమే ముగిసినందున ఎన్నికల షెడ్యూలు వివరాలను సమర్పించాలని ఆదేశించింది. తెలంగాణ బార్ కౌన్సిల్ పాలకవర్గ గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేద ని న్యాయవాది కే అశోక్ హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు.