హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 14వ తేదీకి వాయిదా వేసింది. ఆ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా వాదనలు వినిపించారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిందని, అందులో కీలకమైన ఆధారాలు లభించాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ను రద్దుచేయాలని విన్నవించారు. ఇదిలాఉండగా తెలంగాణ ప్రభుత్వం తరపున తుషార్‌మెహతా వాదనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అదనపు సొలిసిటర్ జనరల్ పోస్టును కేంద్ర హోంశాఖ భర్తీ చేస్తుంది. ఆ స్థానంలో ఉన్న ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తరపున వాదనలు వినిపించడం చర్చనీయమైంది.