హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పీజీ మెడికల్ కాలేజీల్లో 102 సీట్లు పెరిగాయి. ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో 23, మహబూబ్‌నగర్‌లో 4, నల్లగొండలో 19, నిజామాబాద్‌లో 8, రామగుండంలో 16, సిద్దిపేటలో 8, సూర్యాపేటలో 16, నిమ్స్‌లో 4, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 4 సీట్లు పెంచుతున్నట్టు ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీచేసింది.