నోటిఫికేషన్ విడుదలచేసిన ఓయూ
హైదరాబాద్, మార్చి 30 : ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ సెట్ (పీజీఈసెట్) నోటిఫికేషన్ను కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ బుధవారం విడుదల చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభమవుతుందని, రిజిస్ట్రేషన్ ఫీజుగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, వికలాంగులు రూ.500, ఇతర విద్యార్థులు రూ.1,000 చెల్లించాలని కన్వీనర్ తెలిపారు. అభ్యర్థులు జూన్ 22లోపు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. రూ.250 ఆలస్య రుసుమతో జూన్ 30, రూ.వెయ్యి ఆలస్య రుసుముతో జూలై 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు http://pgecet.tsche. ac.in/http:// www.tsche.ac.in ను చూడాలని సూచించారు.