హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రజాప్రాతినిధ్య చట్టం -1951లో నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో తమకు ఫలానా గుర్తునే కేటాయించాలని అభ్యర్థులు కోరుకునే అవకాశం చట్టంలో లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది. దీంతో చపాతీ రోలర్ గుర్తు ను చిహ్నాల జాబితాలో చేర్చాలని కోరు తూ దాఖలైన పిటిషన్‌ను పిటిషనర్ ఉపసంహరించుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల గుర్తుల జాబితాలో ‘చపాతీ రోలర్’ను చేర్చాలంటూ అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ పార్టీ పిటిషన్ వేసింది. దీనిని బుధవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ డివిజన్ బెంచ్ విచారించింది.