Peddapalli | పెద్దపల్లి ఎంపీ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. తన నామినేషన్‌ను అకారణంగా రిజెక్ట్ చేశారని.. ఆ తర్వాత పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించారని స్వతంత్ర అభ్యర్థి, న్యాయవాది పులిపాక రాజ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.
పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ నాయకుడు గడ్డం వంశీ ఎన్నిక చెల్లదని.. పెద్దపల్లిలో ఎంపీ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని తన పిటిషన్లో పులిపాక రాజ్‌కుమార్ కోరారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎంపీలను పార్టీ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఈపీ 31/2024 ద్వారా ఈ పిటిషన్ దాఖలు అయింది.