హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, నాగారంలోని భూదాన్ భూముల అక్రమాలకు భూదాన్ బోర్డ్ కస్టోడియన్ హోదాలో నవీన్ మిట్టల్, అప్పటి ఎమ్మార్వో మహమ్మద్ అలీ తలుపులు తెరిచారని, వారిపై కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నాగారంలోని సర్వే నంబర్181లోని దాదాపు 50 ఎకరాల భూముల అక్రమ లావాదేవీలకు అనుమతించిన అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై ఇచ్చిన ఫిర్యాదును కింది కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ దస్తగిర్ షరీఫ్ పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ కే సుజన సోమవారం విచారించారు. దర్యాప్తు చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని షరీఫ్ తరపు లాయర్ కోరారు. మంగళవారం విచారణ కొనసాగనుంది.