హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : డాక్టర్ బీఆర్ అంబేదర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు, రచయిత కోడూరి విజయేంద్రప్రసాద్పై చేసిన ఫిర్యాదును పోలీసులు మూసేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీ రాంప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ పీ మాధవీదేవి ఇటీవల విచారించారు.
పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి ఫిర్యాదును మూసేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ఇది ఎస్సీ, ఎస్టీ చట్టానికి విరుద్ధమని అన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు, నేరుగా హైకోర్టుకు ఎలా వస్తారని ప్రశ్నించింది. విచారణను జూలై 8కి వాయిదా వేసింది.