కల్వకుర్తి రూరల్, అక్టోబర్ 23 : దోశ గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తి పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన ఉప్పరి వెంకటయ్య (43) బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హోటల్ నుంచి దోశ తీసుకొచ్చాడు. అనంతరం తింటుండగా గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు.