BRS Public Meeting | నేడు వనపర్తిలో బీఆర్ఎస్ బహిరంగసభకు అనుమతి.. ఎస్పీ ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు
BRS Public Meeting | వనపర్తి జిల్లా, రేవన్‌పల్లి మండ లం, గొల్లపల్లి గ్రామ ధర్నాచౌక్‌లో గురువారం బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగసభకు హైకోర్టు అనుమతించింది.
BRS Public Meeting | హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా, రేవన్‌పల్లి మండ లం, గొల్లపల్లి గ్రామ ధర్నాచౌక్‌లో గురువారం బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగసభకు హైకోర్టు అనుమతించింది. సభ నిర్వహణకు ఈ నెల 3న డీఎస్పీ ఇచ్చి న అనుమతిలో విధించిన షరతుల మేరకు సభ నిర్వహించేందుకు అనుమతి మంజూరుచేసింది. ఈ నెల 7న జిల్లా ఎస్సీ సభకు అనుమతిని రద్దు చేస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేసింది.
డీఎస్పీ ఇచ్చిన అ నుమతి ఉత్తర్వులను ఎస్పీ రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకు డు గట్టు యాదవ్ బుధవారం హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలుచేశారు. దీన్ని జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారించారు. బీఆర్ఎస్ నిర్వహించతలపెట్టిన బహిరంగసభను ఎస్పీ రద్దు చేయడాన్ని తప్పుపట్టారు. తొలుత డీఎస్పీ అనుమతి ఇచ్చాక ఏ కారణం చూపకుండానే ఎస్పీ ఆ అనుమతిని రద్దు చేయడం సరికాదని అన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది టీవీ రమణారావు, ప్రభుత్వ న్యాయవాది మహేశ్‌రాజే వాదనలు వినిపించా రు.
గొల్లపల్లి ధర్నాచౌక్‌లో 9న సాయం త్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బహిరంగసభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చాక.. మంగళవారం ఎస్పీ అర్ధాంతరంగా రద్దు చేశారని రమణారావు తెలిపారు. 3న డీఎస్పీ 26 షరతులతో సభకు అనుమతి మంజూరు చేశారని చెప్పారు. అయితే ముందస్తు నోటీసు ఇవ్వకుండానే 7న జిల్లా ఎస్పీ ఆ అనుమతిని అకస్మాత్తుగా రద్దు చేశారని తెలిపారు.
ప్రభుత్వం తరఫున మహేశ్ వా దిస్తూ, ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం సభకు అనుమతించిన సంఖ్య కంటే ఎకువగా జనం హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీంతో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందన్న కారణంతో అనుమతి రద్దు చేసినట్టు వివరించారు. వాదనల తర్వాత హైకోర్టు.. పోలీసులు ఇచ్చిన అనుమతి రద్దు ఉత్తర్వుల్లో బలమైన కారణాలు పే రొనలేదని చెప్పింది. శాంతిభద్రతల కారణంతో అనుమతి రద్దు చేయడం సరైంది కాదని స్పష్టంచేసింది.
భరోసా కల్పించేందుకే సభ : నిరంజన్
గొల్లపల్లి-చీర్లపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ప్రజాభిప్రాయం తెలుసుకొని, భరోసా కల్పించేందుకే హరీశ్‌రావు రానున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం వనపర్తిలోని సింగిరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. గొల్లపల్లి-చీర్లపల్లి రైతులు వంద రోజులుగా రిజర్వాయర్ వద్దంటూ నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

