హైదరాబాద్, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): 45-50 గజాల వరకు మాత్రమే ఇంటి స్థలం ఉన్నవారు ఇం దిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధి పొందేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే 400 చదరపు అడుగుల వరకు ప్లాటు ఉన్నవారు జీ+1(గ్రౌండ్ ఫ్లోర్+మొదటి అంతస్తు) కలిపి 30 చదరపు మీటర్ల (323చ.అ) కు తక్కువ కాకుండా నిర్మాణం చేసుకోవచ్చని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తం నిర్మాణ వైశాల్యంలో 96చ.అ, 70చ.అ తక్కువ కాకుండా రెండు గదులు, 35.5చ.అ తక్కువ కాకుండా వంటగది, ఒక టాయ్‌లెట్, బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టంచేసింది. కాంక్రీట్‌తో నిర్మాణం, ఇంటి డిజైన్‌కు హౌసింగ్‌శాఖ డిప్యూటీ ఈఈ అనుమతి తప్పనిసరని పేర్కొన్నది. గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ తరువాత రూ. లక్ష, మొదటి అంతస్తు స్లాబ్ తరువాత మరో లక్ష, గోడల నిర్మాణం తరువాత రూ. 2లక్షలు మొత్తం నిర్మా ణం అయ్యాక మిగిలిన లక్ష రూపాయలు విడుదల చేస్తామని తెలిపింది.