కొడిమ్యాల, నవంబర్ 7 : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో చివరి మజిలీకి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దహన సంస్కారాలు నిర్వహించాలంటే వాగు దాటి, సైడ్వాల్ ఎక్కాల్సి వస్తున్నది. కొడిమ్యాల మండల కేంద్రంలో దాదాపు 7 వేల జనాభా ఉండగా, బస్టాండ్ ప్రాంతంలోని ఎస్సీ కాలనీలో దాదాపు వెయ్యి కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో ఎవరైనా మరణిస్తే పెద్దవాగు ఒడ్డున దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రదేశానికి రోడ్డు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. గురువారం గ్రామానికి చెందిన కొత్తూరి అంజయ్య మరణించగా శుక్రవారం దహన సంస్కారాలు నిర్వహించారు. వాగు నీటిలో నుంచి దాటుకుంటూ పక్కనే సైడ్వాల్ గోడను ఎక్కుతూ అంతిమయాత్ర నిర్వహించాల్సి వచ్చింది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేసింది.