హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలతో పురోగామి రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తీరుతో స్ఫూర్తి పొంది వేర్వేరు రాష్ట్రాల్లోని పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ చేరికలు సమకాలీన రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మహారాష్ట్రలోని పల్లెపల్లెకు విస్తరిస్తామన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగానే ఆ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్లోకి వలసలు శరవేగంగా సాగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో పలువురు రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన వృత్తి నిపుణులు, ప్రముఖులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మహారాష్ట్ర నుంచి చేరికల వెల్లువ
నాసిక్ సివిల్ సర్జన్ డాక్టర్ లక్ష్మణ్ సబలే, ఆర్థోపెడిక్ డాక్టర్ బిలాల్ షేక్, అడ్వకేట్ ఎన్కే మహాజన్, క్రిస్టియన్ ట్రైబల్ కమ్యూనిటీ స్టేట్ ప్రెసిడెంట్ సందీప్ దేవ్రే, లాతూర్‌లోని దేవ్నీ కార్పొరేటర్ సూర్యవంశీ అమిత్ విజయ్ ప్రకా శ్, భుసావల్‌కు చెందిన నితిన్ తయాడే, స్వాభిమాని షేత్కరీ సంఘటన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమ్‌నాథ్ బోరడే, గంగాఖేడ్ మున్సిపాలిటీ కార్పొరేటర్లు తుకారం తాండడే, బాలాసాహెబ్ రేక్, పాలం మున్సిపాలిటీ కార్పొరేటర్లు బబ్లూ సయ్యద్, చాంద్ పఠాన్, బీడ్ కో- ఆపరేటివ్ బ్యాంక్ మెంబర్ శివాజీరావ్ ఘోడ కే, స్వాభిమాని పక్ష్ జిల్లా అధ్యక్షుడు కుల్దీప్ కర్పే, బీడ్ సేవా సహకారి సంస్థ చైర్మన్ కమలాకర్ లాండే, స్వాభిమాన్ పక్ష్ తాలూకా ప్రెసిడెంట్ లాహు గైక్వాడ్, జల్గావ్కు చెందిన భికు సోనావానే, సోనుపాటిల్, సునీల్ రౌత్, విలా స్ మలేస్, నాసిక్‌కు చెందిన సచిన్ కడ్, ముకుంద్ అహిర్, రామ్ నికమ్, బాపు దూబే, ప్రొఫెసర్ చంద్రకాంత్, కార్పొరేటర్, ఎన్సీపీ షేలు తహసీల్ ప్రెసిడెంట్ రహీమ్‌ఖాన్ పఠాన్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కారెక్కిన జనసేన నేతలు, కార్యకర్తల చేరిక
ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నది. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లోకి భారీగా చేరుతున్నారు. బుధవారం ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మహిళా నేత సుంకర హేమలత, ప్రముఖ న్యాయవాది మలిశెట్టి వెంకటేశ్వరరావుతో పాటు పలు జిల్లాల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్.. వీరికి బీఆర్ఎస్ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో హేమలత ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించనున్నదని ధీమా వ్యక్తం చేశారు.

Cmkcr1