Revanth Reddy | హైదరాబాద్, మే 27 : సీఎం ఇలాకాలో ప్రజలు తీవ్ర కరెంటు కష్టాలను ఎదుర్కొంటున్నారు. చినుకుపడినా, గాలి వీచినా కరెంటు కట్ చేస్తున్నరు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ప్రభుత్వ దవాఖానలో మంగళవారం ఉదయం కరెంటు పోవడంతో వైద్య సిబ్బంది సెల్ఫోన్ లైట్లో రోగులకు మందులు పంపిణీ చేశారు.
ఇది అక్కడి కరెంటు కష్టాలకు నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు. విద్యుత్తుపై ఆధారపడిన చిరు వ్యాపారులు సైతం తరచూ కరెంట్ పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.