హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : భయపెడుతున్న క్లౌడ్‌బరస్ట్ లు.. 40 సెం.మీ వర్షపాతాలు.. భారీ వర్షాలు ..వరదలు.. కరెంట్ కష్టాలు.. ఉ ద్యోగులకు సెలవులు రద్దు. విధులకు హాజరుకాకపోతే సీరియస్ చర్యలుంటాయన్న హెచ్చరికలు ఒక వైపు.. ఓ డిస్కం సీఎండీ, డైరెక్టర్ల విదేశీ టూర్ మరోవైపు.. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. అకాల వ ర్షాలు రాష్ర్టాన్ని కకావికలం చేస్తుంటే.. ప్రజలు హహాకారాలు చేస్తూ.. సాయం కోసం ఎదురుచూస్తుంటే.. విద్యుత్తు సం స్థల అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూ ఖీ, డైరెక్టర్ శివాజీ శనివారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వీరు జీరో ట్రాన్స్మిషన్ వెహికిల్ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నొవేషన్‌పై ఓస్లో (నార్వే), ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్) లో అధ్యయనం చేయనున్నారు. ఆస్కీ, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు కూడా ఈ బృందంలో ఉన్నారు. వర్షాలు కొనసాగుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యం లో వీరు విదేశీ పర్యటనకు వెళ్లడం పట్ల పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.