మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 00:45:32

సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై ప్రజల హర్షం

సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై ప్రజల హర్షం
  • ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాపించకుండా ముందుజాగ్రత్తగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిందని, అందుకే సీఎం కేసీఆర్‌, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ వైరస్‌ వైద్యం కోసం సీఎం కేసీఆర్‌ ఇప్పటికే రూ.500 కోట్లు విడుదలచేశారని, అవసరమైతే రూ.5వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించడం గొప్పవిషయమని తెలిపారు. ఇప్పటికే పార్కులు, పబ్‌లు, సినిమా హాళ్లన్నీ మూసివేసినా జాగ్రత్త చర్యలేం తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నందుకే వారిని కరోనా కాంగ్రెస్‌ పార్టీ అని అంటున్నట్టు చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కరోనా వంటి వైరస్‌లను కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిందేని, కరోనా విషయంలో ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలువాలని పిలుపునిచ్చారు.


‘కరోనా’పై ప్రభుత్వానికి సహకారం: భట్టి

కరోనాపై చేస్తున్న పోరాటంలో ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరిస్తామని సీఎల్పీనేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలియజేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. 


logo
>>>>>>