పొలిటికల్ ప్రచారాలకు సెన్సార్ లేదని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కొందరు నేతలు. ఈ విషయంలో తెలుగు తమ్ముడైన టీపీసీసీ చీఫ్ రేవంత్ పీహెచ్డీ కన్నా పెద్ద పట్టా పుచ్చుకున్నట్టున్నారు. అందుకే, ఎదుటి వ్యక్తి వయసూ, స్థాయిలతో సంబంధం లేకుండా పరుష పదజాలాన్ని ప్రయోగిస్తుంటారు. దిగజారి వ్యాఖ్యలు చేయడంలో ఆయనకు ఆయనేసాటి అనిపించుకుంటున్నారు. మొన్నటికి మొన్న, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల పార్టీ మారుతుంటే ఆపే ప్రయత్నం చేయలేదు సరికదా, పెద్దాయన అని కూడా చూడకుండా తిట్ల దండకం అందుకున్నారు.
ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన విద్యార్థుల పట్లా ఆయనది అదే యాటిట్యూడ్. విద్యార్థులను తాగుబోతులు, అడ్డామీది కూలీలు అంటూ వ్యాఖ్యానించి తన నోటి దురుసుని ప్రదర్శించారు. పలు సందర్భాల్లో వేదికల మీదే బీప్ సౌండ్ వేయాల్సిన పదజాలాన్ని ప్రయోగిస్తూ ఓటీటీ కంటెంట్‌కు తానేం తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. ఈయనగారి వ్యవహార శైలి ఎక్కడి దాకా పోయిందంటే… తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసి, ఇక్కడి సమాజం పెద్దదిక్కుగా భావించే కేసీఆర్‌పైనా చిల్లర వ్యాఖ్యలకు దిగారు.
పత్రికల్లో రాయలేని భాషలో తండ్రి వయసున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నారంటే ఎంత అదుపుతప్పి వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా పదజాలం ప్రయోగిస్తున్నప్పుడు మరింత ఆవేశపడుతుండటం ఏమిటో అర్థం కాదు! తానేదో గోవింద నామ స్మరణ చేస్తున్నట్టు ఎలుగెత్తి అరవడం రేవంత్‌కు రివాజు. ఇదంతా గులాబీ జెండానే మళ్లీ ఎగురుతుందన్న ఫ్రస్ట్రేషన్ కొద్దేనని ప్రజల మాట. అందుకే ‘నువ్ అట్లనే అరువ్… జీవితాంతం అరుస్తనే ఉంటవ్’ అంటూ కేసీఆర్ ైస్టెల్లో జనం రేవంత్‌ను తిట్టుకుంటున్నారు.
– హరిత