హనుమకొండ, నవంబర్ 13: మార్చి 2024 నుంచి రిటైర్ అయిన వారి బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలోని ఏకశిలా జయశంకర్ పారు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు ధర్మేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
20 నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో 20 మంది పెన్షనర్లు ప్రాణాలు కోల్పోయారని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఆందోళనకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్, సాంబారి సమ్మారావు సంఘీభావం తెలిపారు. ధర్నాకు హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి బకాయిల చెల్లింపు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.