హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన జరిగిన పదేండ్లు పూర్తయినా ఇప్పటికీ పలు అంశాలు ఆపరిష్కృతంగానే ఉన్నాయి. వాటిలో విద్యుత్తు ఉద్యోగుల పెన్షన్ ఫండ్ ఒకటి. రాష్ట్ర విభజన సమయం లో నెలకొన్న సందిగ్ధత వల్ల విద్యుత్తు ఉద్యోగుల పెన్షన్ నిధులన్నీ ఏపీకే వెళ్లాయి. దీంతో తెలంగాణకు చెందిన రూ.3,392 కోట్లు పక్క రాష్ట్రంలో మూలుగుతున్నాయి. ఏపీ జెన్కో నుంచి రూ.2,478 కోట్లు, ఏపీ ట్రాన్స్ కో నుంచి రూ.914 కోట్లు రావాల్సి ఉన్నది. కానీ, ఆ నిధులను ఇవ్వకుండా ఏపీ పేచీకి దిగుతున్నది. ఈ అంశాన్ని ఎన్నిసార్లు ప్రస్తావించినా దాటవేస్తున్నది. దీంతో ఈ భారం తెలంగాణ వి ద్యుత్తు సంస్థలపై పడనున్నది. 2004 కు ముందు విద్యుత్తు సంస్థల్లో నియమితులైన ఉద్యోగులకు పెన్షన్‌ను వర్తింపజేస్తున్నారు. ఆ తర్వాత నియమితులైనవారికి సీపీఎస్ విధానం అమలవుతున్నది. తెలంగాణలోని విద్యుత్తు సం స్థల్లో ఈ ఏడాది మార్చి నుంచి ఉద్యోగుల రిటైర్మెంట్లు మొదలయ్యాయి. దీం తో వారికి పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించాల్సి ఉన్నది. కానీ, ఏపీ నుంచి పెన్షన్ ఫండ్ రాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్తు సంస్థ లు చేతులెత్తేశాయి. దీంతో రిటైర్డ్ విద్యుత్తు ఉద్యోగులకు అగచాట్లు తప్పడం లేదు. పెన్షన్ ఫండ్‌ను వెనక్కి తెప్పించాలని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
98 మందితో ఉద్యోగ జేఏసీ కార్యవర్గం
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కుల సాధనకు ఏర్పడిన తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పూర్తిస్థాయి కార్యవర్గం కొలువుదీరింది. 98 మంది తో కూడిన పూర్తిస్థాయి కార్యవర్గాన్ని జేఏసీ నేతలు మంగళవారం బాగ్‌లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ప్రకటించారు. ఇప్పటికే జేఏసీ చైర్మన్‌గా మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌గా ఏలూరి శ్రీనివాస్‌రావును ఎన్నుకున్నా రు. తాజాగా అడిషనల్ సెక్రటరీ జనరల్‌గా పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌గా టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎనుగుల సత్యనారాయణ, సీపీఎస్ ఎంప్లాయీస్ అసొసియేషన్ అధ్యక్షుడు జీ స్థితప్రజ్ఞను నియమించారు. కో చైర్మన్లుగా చావ రవి, జీ సదానంద్‌గౌడ్, వీ రవీందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మారె డ్డి అంజిరెడ్డి, లింగారెడ్డి, నాగిరెడ్డి, మణిపాల్‌రెడ్డి, జ్ఞానేశ్వర్‌ను ఎన్నుకున్నారు. పెండింగ్ డీఏల విడుదల, బిల్లుల చెల్లింపు, సీపీఎస్ రద్దు, ఈహెచ్ఎస్ను ప్రకటించాలని మొత్తం గా 42 డిమాండ్స్‌ను ప్రభుత్వం ముం దుంచారు. అనంతరం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను సన్మానించారు.