హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు అందజేస్తున్న రూ.300 పింఛన్‌ను రూ.3వేలకు పెంచాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వెల్లడించారు. సచివాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని తండాలు, గూడాల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి రూ.700 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో అల్యూమినియం వంట పాత్రల స్థానంలో స్టీల్ పాత్రలు సరఫరా చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో గురుకుల అధికారులు పాల్గొన్నారు.