హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల పెండింగ్ వేతనాల ను అధికారులు విడుదల చేశారు. 2024 డిసెంబర్ నుంచి మార్చి 2025 వరకు 1,665 మందికి రూ. 17.56 కోట్లను విడుదల చేశారు. కొంతకాలం క్రితం 398 మందికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వేతనాలను విడుదల చేశారు. సంఘాల నేతలు ప్రభాకర్, భాస్కర్, మహేశ్ ఇంటర్ విద్యా డైరెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.