రక్షణ శాఖ భూములను బదలాయించాలి
తెలంగాణలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
- పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి
- కేంద్ర కార్యదర్శులకు సీఎస్ విన్నపం
న్యూఢిల్లీ, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆమె న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌తోపాటు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి లీలా నందన్, రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి కండ్లకోయ ఓఆర్ఆర్ వరకు.. ప్యారడైజ్ నుంచి కరీంనగర్, రామగుండం మార్గంలోని ఓఆర్ఆర్ వరకు నిర్మించ తలపెట్టిన రెండు ఎలివేటెడ్ కారిడార్లతోపాటు మెహిదీపట్నం జంక్షన్లో స్కైవాక్ నిర్మాణం కోసం రక్షణ శాఖకు చెందిన 150.39 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు.
దీనిపై రక్షణ శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. సంబంధిత వివరాలను తెప్పించుకుని త్వరలో తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సీఎస్ శాంతికుమారి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి లీలా నందన్‌ను కలిశారు. ప్రధాన మంత్రి గ్రామీణ గ్రామ సడక్ యోజన కింద తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు వద్ద పెండింగ్‌లో 60 ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అనురాగ్జైన్తో సమావేశమై.. రీజనల్ రింగ్ రోడ్ల నిర్మాణ పనుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

