హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పెండింగ్ డీఏలను విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్, కోదండరాంను టీఎన్జీవోస్ కోరారు. నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు డీఏ బకాయిలు చెల్లించే నిర్ణయం తీసుకోవాలని టీఎన్జీవో ప్రతినిధులు వారిని కలిసి తీర్మాన ప్రతిని వారికి అందజేశారు. తమ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని (ముజీబ్) పేర్కొన్నారు.