హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ట్రెజరీ కార్యాలయాల్లో ఆమోదం పొంది ఆర్థికశాఖ వద్ద రెండేండ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరుచేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వానిన డిమాండ్ చేసింది. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్లో నిర్వహించగా, రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావరవి, సీహెచ్ రాములు, దుర్గాభవాని, లక్ష్మారెడ్డి, సోమశేఖర్, గాలయ్య తదితరులు పాల్గొన్నారు.