మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పెంపుడు కుక్కతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్టేషన్ సమీపంలో 114వ మైలు వద్ద గుర్తు తెలియని వ్యక్తి ట్రాక్‌పై పడి ఉన్నాడనే సమాచారం అందడంతో పోలీసులు సిబ్బందితో వెళ్లి చూడగా ఓ కుక్కతో సహా మృతి చెంది ఉన్నాడు.
పరిసరాల లో అతని ఆచూకీ కోసం వెతకగా ఘటనా స్థంలో అతను సేవించిన మద్యం సీసా, కూల్‌డ్రింక్‌తో పాటు ఓ సం చి లభించిందని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి యొక్క వివరాలు ఎవరికైనా తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.