టేకుమట్ల, జూన్ 18: ‘పెద్దపల్లి ఏసీపీ నా భూమిని కొనుగోలు చేసి సగం డబ్బులు ఇ చ్చాడు. మిగతా డబ్బులు రిజిస్ట్రేషన్ అయ్యాక ఇస్తానని నమ్మబలికి.. నా భూమిని ఆయన భార్య పేరుమీదకు బదలాయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ అయ్యాక మిగతా డబ్బులు ఇవ్వాలని అడిగితే ముప్పుతిప్పలు పెడుతున్నాడు’ అని ఓ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు, ఎమ్మెల్యేకు చెప్పినా న్యాయం చేయడం లేదంటూ పురుగుల మందు డబ్బా పట్టుకొని బంధువులతో కలిసి మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో ధర్నాకు దిగాడు. రైతులు, స్థానిక ప్రజలు ఆ వృద్ధుడికి మద్దతుగా నిలిచారు. మండలంలోని ఆరెపల్లికి చెందిన ఇటుకాల రాయమల్లుకు సర్వే నెంబర్ 63/అ/1-62/ఇ/1లో 39 గుంటల భూమి ఉంది. ద వాఖానలో తన ఆరోగ్యం బాగుచేయించుకోవాలని ఆ భూమిని అమ్మకానికి పెట్టాడు. అదే గ్రామానికి చెందిన (పెద్దపల్లిలో ఏసీపీ) గజ్జి కృష్ణ (ప్రస్తుతం హనుమకొండలో నివాసం ఉంటున్నారు) తన భార్య రాధికారాణి పేరిట రూ.13.65 లక్షలకు కొనుగోలు చేశాడు.
ఒప్పందం ప్రకారం మొదట రూ.7 లక్షలు చెల్లించి, రిజిస్ట్రేషన్ సమయంలో రూ.6.65 లక్షలు ఇవ్వాల్సి ఉన్నది. రిజిస్ట్రేషన్ రోజున గ్రా మస్థుడు కుర్రె ప్రభాకర్ డబ్బులివ్వాలని అడుగగా.. ‘యూజ్లెస్ ఫెలో.. నీకెలా కనపడుతున్నాను’ అంటూ ఏసీపీ బూతులు తిట్టి ఇంటికెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లి అడుగగా.. భూమి లో ఉన్న బోరును రిపేర్ చేస్తేనే మిగతా డబ్బు లు ఇస్తానని మెలికపెట్టాడు. ఆ విషయమై తాను కాగితం రాసుకోలేదని, తన డబ్బులు ఇవ్వాలని కోరాడు. పెద్ద మనుషులతో ఒత్త్తిడి చేయగా.. ‘ఇంటికి ఎందుకు వస్తున్నారు? భూమి మా పేరు మీదకు వచ్చింది. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి’ అంటూ బెదిరించాడని గ్రామ పెద్ద మనిషి బాషబోయిన రాజ య్య పేర్కొన్నాడు. ఇదే విషయమై బాధితుడు టేకుమట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతోపాటు సీఐ, డీఎస్పీతోపాటు స్థానిక ఎమ్మె ల్యే గండ్ర సత్యనారాయణరావును కలిసినా న్యాయం జరగలేదు. దీంతో చావే శరణ్యమనుకున్న వృద్ధుడు బంధువులతో కలిసి పురుగుల మందు డబ్బాతో టేకుమట్లలో ధర్నాకు దిగాడు. పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించాడు. ఈ విషయమై ఏసీపీ గజ్జి కృష్ణ భార్య రాధికారాణిని వివరణ అడుగగా.. మా ఎదుగుదలను చూసి ఓర్వలేని మా బంధువులే మమ్మల్ని బద్నాం చేస్త్తున్నరు’ అని తెలిపారు.
ఆర్ఎస్సై నా భూమిని ఆక్రమించాడు;ములుగు ఎస్పీకి ఓ రైతు ఫిర్యాదు
పోలీస్ ఆర్ఎస్సై తన భూమిని ఆక్రమించాడని ములుగు మండలం దేవనగర్కు చెందిన బొమ్మరబోయిన కుమార్ అనే రైతు మం గళవారం ఎస్పీ డాక్టర్ పీ శబరీష్కు ఫిర్యా దు చేశాడు. దేవనగర్లో సర్వే నంబర్ 91/3లో వారసత్వంగా వచ్చిన ఆరు గుంటల భూమిని గడ్డి ప్రశాంత్ అనే ఆర్ ఎస్సై ఆక్రమించినట్టు తెలిపాడు. ఈ నెల 10న ప్రశాంత్ పోలీసులతో వచ్చి తనను బెదిరించినట్టు పేర్కొన్నాడు. విచారణ చేసి న్యాయం చేయాలని కోరాడు.