హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు 13 నెలల పాలనలో కోతలు, ఎగవేతలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పార్టీ నేతలు మన్నె గోవర్ధన్, రాంబాబు యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో భూమిలేని పేదలకు ఏటా రూ.12 వేల చొప్పున చెల్లిస్తామని, ఇప్పుడు 20రోజుల ఉపాధి పనిదినాల పేరిట కొర్రీలు పెడుతున్నదని విమర్శించారు. ఉపాధి జా బ్ కార్డు కలిగి, 20రోజులు పనిచేసిన వారి కే ఇస్తామని నాడెందుకు చెప్పలేదని నిలదీశారు. రాష్ట్రంలో 58 లక్షలపై చిలుకు జాబ్‌కార్డులు ఉన్నాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ కుటుంబాల సంఖ్య 3.27 లక్షలకే మిగులుతుందని చెప్పారు.