పెద్దపల్లి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను ఉల్లంఘించిందని పెద్దపల్లి మాజీ ఎమ్మల్యే గోనె ప్రకాశ్‌రావు విమర్శించారు. సోమవారం ఆయన పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను బీసీలకు ఇస్తామని ఏఐసీసీ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డిక్లరేషన్ ప్రకటించి.. అమలు చేయకుండా ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. డిక్లరేషన్ మేరకు తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలోని 34 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు అవకాశం ఇవ్వాల్సి ఉన్నదని సూచించారు. కానీ, ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన 55 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించినట్టు చెప్పారు. ఆ 12 స్థానాల్లోనూ ఓడిపోయే అభ్యర్థులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.