హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా రైతులకు పప్పుదినుసు వంగడాల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రూ. 2.68 కోట్ల సబ్సిడీతో 19,397 ఎకరాలకు సరిపడా 5825 క్వింటాళ్ల శనగ విత్తనాల పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. రూ. 45.41 లక్షలతో 83.78 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు హైబ్రిడ్ విత్తనాలు, 74 క్వింటాళ్ల కుసుమ విత్తనాలను సరఫరా చేస్తున్నట్టు ఆయన తెలిపారు.