పరిగి, నవంబర్ 28 : లగచర్ల రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌తోపాటు పలువురు నాయకులను గురువారం పోలీసులు పరిగిలో అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ మాట్లాడుతూ.. లగచర్లలో బాధితుల్లో ఎస్టీ, ఎస్సీ రైతులే అధికంగా ఉన్నారని తెలిపారు.
ప్రభుత్వం ఫార్మా కంపెనీ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని, బలవంతంగా భూసేకరణ చేయొద్దని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.