హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదుచేస్తామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో అటవీశాఖ అధికారుల సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ సువర్ణ, సునీతభగవత్తో కలిసి ఆమె మాట్లాడారు.