హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన వారందరికీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్‌కు విజయాన్ని కట్టబెట్టిన ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు అధికారం అప్పగించి ప్రజలు తమపై మరింత బాధ్యతను పెంచారని అన్నారు. జోడో యాత్ర ద్వారా తెలంగాణలో రాహుల్‌గాంధీ స్ఫూర్తిని నింపారని చెప్పారు. రాహుల్‌గాంధీ అండతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ విజ యం సాధించిందని తెలిపారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు.