హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సమక్షంలో పీసీసీ జాయింట్ సెక్రటరీ మందగడ్డ విమల్‌కుమార్ తన అనుచరులతో కలిసి బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు రావడం తనకు సొంతింటికి వచ్చినట్టుగా ఉన్నదని పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచన మేరకు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి నేతృత్వంలో తామంతా బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు విమల్‌కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. విమల్కుమార్తోపాటు కుర్రి రఘునాథ్‌రెడ్డి, ఎం శంకర్, రాములు, బ్రహ్మయ్య, దివ్యారెడ్డి, వై సునీత, జీ రాజాకుమార్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వాలా హరీశ్, మల్లారెడ్డి, శ్రీకాంత్, మల్లేశ్, సింగారెడ్డి, రవీందర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.