హైదరాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ) : షాబాద్ ఘటనలో పోక్సో కేసు నిందితుడికి బెయిల్ ఇవ్వడం పోలీసుల వైఫల్యమేనని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. పోక్సో చట్టాన్ని కఠినంగా అమలుచేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. బాధితులకు రక్షణ కల్పించకపోవడం, పోక్సో కేసుల్లో బెయిల్‌ను కఠినంగా పరిశీలించకపోవడంతోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దర్యాప్తు, విచారణలో జాప్యం కారణంగా అనేక మంది బాధితులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన పలు సూచనలు చేశారు.