Pawan Kalyan | రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదు.. తెలంగాణపై మళ్లీ విషం చిమ్మిన పవన్ కల్యాణ్
Pawan Kalyan | తెలంగాణ ఏర్పడి 12 ఏండ్లు గడిచినా ఏపీ నేతల విద్వేషం ఏ మాత్రం చల్లారలేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు అనుమతివ్వలేదని అదే రోజు ప్రెస్‌మీట్ పెట్టి మరి ‘తెలంగాణ మీ అయ్య జాగీరా..?’ అంటూ కయ్యానికి కా లు దువ్విన ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి రాష్ట్ర ఏర్పాటును ఢిల్లీ వేదికగా తప్పు బట్టారు.
Pawan Kalyan | హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడి 12 ఏండ్లు గడిచినా ఏపీ నేతల విద్వేషం ఏ మాత్రం చల్లారలేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు అనుమతివ్వలేదని అదే రోజు ప్రెస్‌మీట్ పెట్టి మరి ‘తెలంగాణ మీ అయ్య జాగీరా..?’ అంటూ కయ్యానికి కా లు దువ్విన ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి రాష్ట్ర ఏర్పాటును ఢిల్లీ వేదికగా తప్పు బట్టారు. తెలంగాణ, ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరు సరిగ్గా లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సోమవా రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటుకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదంటూనే.. ఏపీని విభజించిన తీరు చూసి మాత్రమే ఆవేదన చెందినట్టు సెలవిచ్చారు. అందుకే ఇప్పటికీ ఆస్తుల పంపకాలు జరుగలేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటివరకు కాంగ్రెస్ ధోరణి మారలేదని, తెలంగాణ కోసం అమరులైన 1200 మందికి నివాళులర్పించేందుకు బయల్దేరితే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఈ పరిణామం ఆ పార్టీ హిపోక్రసీకి నిదర్శనమన్నారు. పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

