ఖైరతాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రాష్ట్ర పర్యటనలో తెలంగాణ నీ అయ్య జాగీరా అంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, తక్షణమే వ్యా ఖ్యలు వెనక్కి తీసుకోవాలని బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఏపీలో బీసీ ల పరిస్థితి దారుణంగా ఉన్నదని చెప్పా రు. గతంలో ఉన్న కొన్నిసీట్లు కూడా ఇ ప్పుడు దక్కడం లేదని, అగ్రవర్ణ పాలకులే రాజ్యమేలుతున్నారని అన్నారు.
బీసీలకు బడ్జెట్ కేటాయింపులోనూ తీ వ్ర అన్యాయం జరుగుతున్నదని, ప్రభు త్వ అభివృద్ధి కార్యక్రమాల్లో సైతం బీసీ నేతల పేర్లు వాడటం లేదని తెలిపారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలను వక్రీకరించి లేనిపోని ఆరోపణలు చేస్తూ త ప్పుడు కేసులు పెట్టారని, దీనిని ఖండిస్తున్నామన్నారు. ఇరు రాష్ర్టాలకు చెంది న బీసీలు చైతన్యవంతులై రాజ్యాధికా రం సాధించుకోవాలని పిలుపు ఇచ్చా రు. సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కోచైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్‌ముదిరాజ్ పాల్గొన్నారు.