సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9 గంటల వరకు నగరంలోని ఈఎస్ఎస్ మల్కారంలో 1.85సెం.మీలు, బషీర్‌బాగ్‌లో 1.78 సెం.మీలు, ఖైరతాబాద్‌లో 1.78సెం.మీలు, బంజారాహిల్స్‌లో 1.43సెం.మీలు, కీసరలో 1.30సెం. మీలు, ఫస్ట్‌లాన్సర్‌లో 1.20సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. కాగా నగరంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 32.4డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.0డిగ్రీలు, గాలిలో తేమ 87శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.