Toshisuke Kanazawa | 90 ఏళ్ల వయస్సులో బాడీ బిల్డింగ్ టైటిల్.. జపాన్ తాతా సంచలనం..!
Toshisuke Kanazawa | ఇప్పటి యువత 30 ఏళ్ల వయస్సుకే ముసలోళ్లలా ఆపసోపాలు పడుతుంటారు. నాలుగు అడుగులు నడవాలన్నా నరకంలా ఫీలవుతారు. బండి లేనిదే బయటికి రారు. కానీ హిరోషిమా (Hiroshima) కు చెందిన తోషిసుకె కనజావా (Toshisuke Kanazawa) ఇటీవల తన 90వ పుట్టినరోజు జరుపుకున్నారు.
Toshisuke Kanazawa : ఇప్పటి యువత 30 ఏళ్ల వయస్సుకే ముసలోళ్లలా ఆపసోపాలు పడుతుంటారు. నాలుగు అడుగులు నడవాలన్నా నరకంలా ఫీలవుతారు. బండి లేనిదే బయటికి రారు. కానీ హిరోషిమా (Hiroshima) కు చెందిన తోషిసుకె కనజావా (Toshisuke Kanazawa) ఇటీవల తన 90వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ మరుసటిరోజే బాడీబిల్డింగ్ (Bodybuilding) లో 19వ సారి జాతీయ టైటిల్ విజేతగా నిలిచారు.
తొమ్మిది పదుల వయసులోనూ నిత్యం జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. బరువులు ఎత్తుతున్న కనజావా ‘ఆల్ జపాన్ మాస్టర్స్ ఫిట్నెస్ ఛాంపియన్షిప్’ పోటీలో 85 ఏళ్లు పైబడ్డ విభాగంలో ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆహార నియమాల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాను మాంసం, చేపలు మానేశానని చెప్పారు. 50 ఏళ్ల వయసులో బాడీబిల్డింగులోకి తిరిగి అడుగుపెట్టాక పూర్తిగా శాకాహారిగా ఉంటున్నానని అన్నారు.
ఎక్కువగా సోయాచిక్కుడుతో చేసే జపాన్ వంటకాలైన నాటో, మిసో సూప్‌తోపాటు ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో బ్రౌన్రైస్తోపాటు కొద్దిగా ఫ్యూరీకేక్ (ఎండిన సముద్రపు నాచు, నువ్వుల పొడి) తింటా’ అని కనజావా వివరించారు. పులియబెట్టిన ఆహారాలైన నాటో, మిసో కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడి, ప్రయోజకనకరమైన పోషకాలు అందిస్తాయన్నారు. 34 ఏళ్ల వయసులో బాడీబిల్డింగు పోటీల నుంచి విరమించిన కనజావా.. అనారోగ్యంతో ఉన్న తన ఇల్లాలిని ఉత్తేజపరచడానికి పదహారేళ్ల తర్వాత మళ్లీ ఇందులోకి వచ్చి ఇన్నేళ్లుగా కొనసాగుతుండటం విశేషమని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నేను నా గర్ల్‌ఫ్రెండ్‌తో రెస్టారెంట్‌కు వెళ్లా.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న రాహుల్‌గాంధీ..!
Jupally Krishna Rao | కాలువల నుండి ఒక్క చుక్క నీరు ఇవ్వం.. మంత్రి జూపల్లి కృష్ణారావు
Free bus | ఫ్రీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు : వీడియో
Teachers | స్టూడెంట్స్ అటెండెన్స్ 95% ఉంటేనే టీచర్లకు సెలవులు.. హైదరాబాద్ కలెక్టర్ ఉత్తర్వులతో ఉపాధ్యాయుల్లో అసహనం!
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి ఓటీటీలో అద్భుతమైన స్పందన.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

