Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి ఓటీటీలో అద్భుతమైన స్పందన.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్!
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది.
విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. థియేటర్ల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అడుగుపెట్టిన ఈ చిత్రానికి ఊహించని విధంగా భారీ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులతో పాటు వివిధ భాషల ప్రేక్షకులు ఈ సినిమాపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు.
ఈ చిత్రంలో చూపించిన చారిత్రక సంఘటనలు, బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. కొంతమంది బ్రిటన్ నెటిజన్లు సినిమాలో చూపించిన బ్రిటిష్ పాలన విధానాలపై స్పందిస్తుండగా, మరికొందరు వలసవాద పాలనలో భారతీయులు పడిన నష్టాలు మరియు జరిగిన దారుణాలను గుర్తుచేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, పవర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని, జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా అద్భుతంగా నటించారని నెటిజన్లు కొనియాడుతున్నారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ టేకింగ్, చరిత్రను నిజాయితీగా తెరకెక్కించిన విధానంపై కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందించగా, టి-సిరీస్ సమర్పించింది. మొత్తానికి ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్‌తో ‘రణబాలి’ సినిమా సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teachers | స్టూడెంట్స్ అటెండెన్స్ 95% ఉంటేనే టీచర్లకు సెలవులు.. హైదరాబాద్ కలెక్టర్ ఉత్తర్వులతో ఉపాధ్యాయుల్లో అసహనం!
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి ఓటీటీలో అద్భుతమైన స్పందన.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్!
మేనిఫెస్టోకు మూడేళ్లు.. కాంగ్రెస్ నయవంచనకు మూడేళ్లు.. అభయ హస్తం కాస్త మొండి హస్తమయ్యిందని హరీశ్‌రావు సెటైర్లు
Kyiv Bridges: కీవ్‌లో రెండు బ్రిడ్జ్లపై రష్యా దాడి: మేయర్ క్లిచ్కో
లావుడియా తండ గ్రామ పెద్దగా వాగ్య నాయక్ ఎన్నిక
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

