నల్లగొండ ప్రతినిధి, జూన్ 4(నమస్తే తెలంగాణ): అమరావతి బ్రహ్మాండం.. ప్రపంచంలోనే అంత మంచి రాజధాని లేదని చెప్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తోపాటు కూటమి నేతలంతా తమ కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లో ఎందుకు ఉంటున్నారని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటూ అమరావతిలో పాలన చేస్తున్న సెటిల్ సర్వీసుల ప్రయాణాలు బంద్ చే సుకోవాలని సూచించారు. గురువారం ఆ యన నల్లగొండలో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.
తెలంగాణలో ఉంటూ ఏపీలో పాలన చేస్తే అక్కడ సరైన అభివృద్ధి జరుగదని సూచించారు. అవతరణ దినోత్సవం రోజున పవన్ సభ పెట్టాలనుకోవడమే తీవ్ర తప్పిదమన్నారు. తెలంగాణ అనేది ఇక్కడి ప్రజల సెంటిమెంట్ అని తెలిసి కూడా సభకు ప్రయత్నించడం తగదన్నారు. ‘తెలంగాణ మీ అయ్య జాగీ రా?’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.