హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ ఆరోపించారు. బుధవారం ఓ ఆంగ్ల న్యూస్ చానల్ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని చె ప్పారు.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రాంతీయవాదం పేరిట చేస్తున్న రాజకీయాలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని అన్నారు. కాంగ్రెస్ నాయకులు పదేపదే హైదరాబాద్‌లో అడుగుపెట్టనీయబోమని చెప్పారని, అలా అయితే రాహుల్‌గాంధీకి దక్షిణాదితో సంబంధం లేదని చెప్పాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. తనను హైదరాబాద్ రావొద్దు అన్న కాంగ్రెస్ నేతలను ఉద్దేశించే తాను ‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అనే వ్యాఖ్యలు చేసినట్టు పవన్‌కల్యాణ్ వివరణ ఇచ్చారు.