కోస్గి, జూన్ 28 : ‘సర్’పై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఎల్ఏలతో కలిసి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం ఇలాకాలో తిరుగుతుంటే ఆరు గ్యారెంటీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఎవరికైనా రెండుచోట్ల ఓటు ఉంటే వెంటనే ఒక దానిని తొలగించాలని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తంచేశారు.