హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధిస్తూ జారీచేసిన సర్క్యూలర్‌ను వెంటనే నిలిపివేయాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి మంగళవారం బహిరంగలేఖ రాశారు. తమ సమస్యల పరిషరించడానికి విద్యార్థులు ప్రజాస్వామిక పద్ధతిలో నిరసనలు, ధర్నాలు చేయడం సహజమని పేర్కొన్నారు.
ఓయూ, కేయూతోపాటు రాష్ట్రంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే ఇలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు ఉండవని, వెంటనే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీచేయాలని కోరారు.