Lingala ganapuram | పాత పథకానికి కొత్త మెరుగులు..! ఇది ఎమ్మెల్యే కడియం శ్రీహరి మార్క్ అభివృద్ధి
Lingala ganapuram | పటేల్ గూడెంలో కడియం శ్రీహరి ప్రారంభించిన పథకం విమర్శలకు తావిస్తోంది.
లింగాల గణపురం : జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పటేల్ గూడెంలో కడియం శ్రీహరి(MLA Kadiyam) ప్రారంభించిన పథకం విమర్శలకు తావిస్తోంది. గతంలో ప్రారంభించిన పథకానికే మెరుగులు దిద్ది పాత శిలాఫలకం కనిపించకుండా కొత్తగా కడియం ప్రారంభిస్తున్నట్టు శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పటేల్ గూడెంలో స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యేగా డాక్టర్ తాటికొండ రాజయ్య ఉన్నప్పుడు ఆ గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు అయింది. పథకం పూర్తి కాగానే అప్పటి ఎమ్మెల్యే రాజయ్య పథకాన్ని ప్రారంభించారు.
దానికి సంబంధించిన శిలాఫలకాన్ని సైతం వేశారు. అదే పథకానికి కడియా శ్రీహరి రెండు లక్షల రూపాయలు మంజూరు చేయించి కొత్తగా మెరుగులు దిద్దించారు. పాత శిలాఫలకం కనిపించకుండా ఆ శిలాఫలకం పైనే కొత్తగా కడియం శ్రీహరి ప్రారంభిస్తున్నట్లు శిలాఫలకాన్ని వేయించారు. నియోజవర్గానికి తాను అభివృద్ధి ప్రదాతను అని పదేపదే ప్రకటించుకుంటున్న కడియం శ్రీహరి.. పాత పథకాలను కొత్తగా మెరుగులు దిద్ది ప్రారంభించి ఇదేనా కడియం మార్క్ అభివృద్ధి అంటూ ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

