MLA Mahipal Reddy | రామచంద్రాపురం : తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్లో నిర్మించిన తాగునీటి రిజర్వాయర్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘనందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే నువ్వే పెద్ద లీడర్వు అన్ని నువ్వే చేసుకరా అని దురుసుగా సమాధానం ఇచ్చాడు. అది కాదు అన్న సమస్యలు ఉన్నాయ్ అని మీకు రిక్వెస్ట్ చేస్తున్న.. నువ్వే లీడర్ షిప్ చేస్తున్నావ్ పబ్లిక్‌తో ఎలెక్ట్ అయ్యావు కదా అనడంతో ఆయన నేనెందుకు లీడర్ షిప్ చేస్తాను అన్న అనడంతో ఉకో సప్పుడు చేయకు తమాషా చేస్తున్నావా అంటూ ఘాటుగా మాట్లాడారు. ఎమ్మెల్యే దురుసుప్రవర్తనతో అక్కడ ఉన్నవారు అందరూ అవాక్కయ్యారు.
ఎమ్మెల్యే, ఎంపీకి గేటెడ్ కమ్యూనిటీకి చెందిన మహిళలు కూడా తమ సమస్యలను విన్నవిస్తుండగా.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీ సమస్య ఏంటి చెప్పండి.. ఓట్లతోని భయపెట్టకండి.. ఓట్ల కోసం బయపడేటోడు ఎవడు లేడు ఈడ అంటూ ఘాటుగా స్పందించడంతో మహిళలు అసహనం వ్యక్తం చేశారు.