10వ తేదీన అందుబాటులో పాస్‌పోర్టు సేవలు..
Passport | ఈనెల 10 (శనివారం)న కూడా పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తత్కాల్ కేటగిరీ కింద దరఖాస్తుల సమర్పణలో దీర్ఘకాల
హైదరాబాద్ : ఈనెల 10 (శనివారం)న కూడా పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తత్కాల్ కేటగిరీ కింద దరఖాస్తుల సమర్పణలో దీర్ఘకాల అపాయింట్మెంట్లను త్వరితగతిన పరిష్కరించే చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లో అమీర్ పేట్, బేగంపేట, టోలీచౌకీలో, కరీంనగర్, నిజామాబాద్ పీఎస్కేలు సేవలు అందిస్తాయని ఆయన తెలిపారు. పూర్తి అపాయింట్మెంట్లు (తత్కాల్ కింద 60 శాతం, సాధారణ కేటగిరీ కింద 40 శాతం) విడుదల చేసినట్టు వివరించారు. దరఖాస్తుదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తత్కాల్ కేటగిరీ కింద ప్రాసెసింగ్ అప్లికేషన్ సమర్పించడానికి అర్హత ఉన్న పత్రాల జాబితా కోసం పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌ని సంప్రదించాలని కోరారు. సాధారణ కేటగిరీ దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి మొత్తం 14 పీఓపీఎస్‌కే(పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు)లలో పూర్తి అపాయింట్ మెంట్లు జారీ చేస్తామని తెలిపారు.
కాగా ప్రత్యేకంగా అందించే ఈ సేవల కోసం ఒక్కసారి మాత్రమే రీషెడ్యూలింగ్‌కు అనుమతించబడుతుందని వివరించారు. దరఖాస్తుదారులు జాగ్రత్తగా రీ షెడ్యూల్ చేసుకోవాలని, విఫలమైతే వారికి రీషెడ్యూల్ లేదా మరో తేదీని ఎంచుకోవడానికి అవకాశం ఉండదని పేర్కొన్నారు. దరఖాస్తుదారులందరూ www.passportindia.gov.in పోర్టల్ ద్వారా లేదా mPassportseva యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. స్లాట్ లు బుక్ చేసుకున్న సంబంధిత PSKలు/POPSKలను సంప్రదించాలని సూచించారు. పాస్‌పోర్ట్ సేవల కోసం ఎటువంటి బ్రోకర్లను ఆశ్రయించొద్దని దాసరి బాలయ్య సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

