Smoking | శంషాబాద్ రూరల్, నవంబర్ 18 : విమానంలో సిగరెట్ తాగిన ప్రయాణికుడిని ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది ఆదుపులోకి తీసుకున్న ఘటన సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జరిగింది. సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అబిదాబి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ 6 ఈ 1408 విమానంలో ఓ ప్రయాణిడు సిగరెట్ తాగుతుండగా గమనించిన ఎయిర్హోస్టర్ పైలట్‌కు సమాచారం ఇచ్చారు. పైలట్ ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని ప్రయాణికుడిని ఆదుపులోకి తీసుకున్నారు. విమానంలో సిగరెట్ తాగడం పూర్తిగా నిషేధం.